English | Telugu

హీరోని చూసి భయపడుతున్న డైరెక్టర్ 

బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ గా చాలా జోరు మీద ఉన్నాడు. హిట్ మీద హిట్ కొడుతూ జెట్ స్పీడ్ తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఎన్నో పరాజయాల తర్వాత పఠాన్ ,జవాన్ లతో లైం లైట్ లో కొచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డులు సృష్టించి కల్లెక్క్షన్ ల సునామీని సృష్టించాడు. ఆ రెండు సినిమా లు 1000 కోట్లుకు పైగా వసూలుచేసి ఇండియన్ సినిమా ముందు సరికొత్త టార్గెట్ ని ఉంచాయి. అలాంటి ట్రెండ్ ని క్రియేట్ చేసిన షారుక్ మీద తాజాగా బాలీవుడ్ బడా డైరెక్టర్ కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు హిందీ చిత్ర సీమలో సెగలు పుట్టిస్తున్నాయి.


కరణ్ జోహార్ అండ్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పాలిసిన పనిలేదు. ఎన్నో హిట్ సినిమాలు ఆ ఇద్దరి కాంబోలో వచ్చాయి. అలాగే షారుఖ్ నటించిన కొన్ని సినిమాలకి కరణ్ స్క్రీన్ ప్లే ని కూడా అందించాడు. అంతటి సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉంది. కరణ్ జోహార్ తాజాగా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని అనే ఒక కొత్త సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ లో ఒక క్యామియో రోల్ లో నటించమని షారుఖ్ ని నేను అడిగితే కాదనకుండా నటిస్తాడు కానీ నటించమని షారుఖ్ ని అడిగే దైర్యం నాకు లేదు అని కరణ్ అన్నాడు.
ఇప్పుడు కరణ్ అన్న ఈ మాటలు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే షారుఖ్ గతంలో రణబీర్ కపూర్ హీరో గా వచ్చిన బ్రహ్మాస్త సినిమాలో క్యామియో రోల్ లో నటించాడు. అలాగే ఇప్పుడు తాజాగా వస్తున్న సల్మాన్ ఖాన్ టైగర్ 3 లో కూడా షారుఖ్ క్యామియో లో నటిస్తున్నాడు. మరి అలాంటిది తనకి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన కరణ్ అడిగితే క్యామియో రోల్ లో నటించడానికి షారుఖ్ ఒప్పుకునే వాడు మాకు వెంటనే షారుఖ్ ని తెర మీద చూసి ఆనందించేవాళ్ళం అని షారుఖ్ ఫాన్స్ అనుకుంటున్నారు. ఇంతకీ క్యామియో రోల్ అంటే అర్ధం ఏమిటంటే ఒక బిగ్ హీరో ఒక సినిమాలో అలా వచ్చి ఇలా కనపడి వెళ్లడాన్ని క్యామిక్ రోల్ అంటారు.